మళ్లీ హన్మకొండ జిల్లా?
వరంగల్ నగరాన్ని రెండు ముక్కలుగా చేసే ప్రయత్నానికి మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నగరాన్ని రెండు ముక్కలుగా చేసి సమీప మండలాలను కలిపి వరగంల్, హన్మకొండ జిల్లాలుగా మార్చే ఆలోచనకు ప్రభుత్వం మళ్లీ పదును పెడుతోంది. ఫలితంగా నగరంలోని ఒక ప్రాంతం వారు మరో ప్రాంతానికి నాన్‌లోకల్ అయ్యే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఏర్పడుతోంది. జిల్లాల పునర్విభజన సందర్భంలోనే ఎవరు ఇచ్చిన సలహానోగానీ వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ ఈ ప్రతిపాదనను జిల్లాకు చెందిన, ముఖ్యంగా వరంగల్ నగరానికి చెందిన మెజారిటీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఘనచరిత్ర ఉన్న నగరాన్ని రెండు ముక్కలుగా చేయడం ద్వారా వరంగల్ నగర ఆస్తిత్వాన్ని దెబ్బతింటుందని అందరూ ఆందోళన వ్యక్తం చేసారు.













