అక్టోబరు నుంచి విదేశాలకు గో ఎయిర్
అక్టోబరు నుంచి విదేశాలకు విమానాలు నిర్వహించాలని గో ఎయిర్ ప్రణాళికలు రూపొందించింది. తొలుత ఆసియా ప్రాంతంలోని గమ్యస్థానాలకు సర్వీసులు ప్రారంభించాలన్నది తమ యోచనగా గోఎయిర్ మేనేజింగ్ డైరెక్టర్ జె వాడియా తెలిపారు. 144 ఎయిర్‌బస్ నియో ఏ320 విమానాలకు గోఎయిర్ ఆర్డరు ఇచ్చింది. ప్రస్తుతమున్న 24 విమానాలకు ఇవి జతవుతాయని వాడియా తెలిపారు. పబ్లిక్ ఇష్యూ యోచన కూడా చేయడం లేదని తెలిపారు.








