ఏయూ లో బయోటెక్నాలజీ అంతర్జాతీయ సదస్సు
పర్యావరణ హితం కోసం పర్యావరణ బయోటెక్నాలజీ -2017 అంతర్జాతీయ సదస్సును నవంబరు 23 నుంచి 25 వరకు ఆంధ్రవిశ్వవిద్యాలయం(ఏయూ) నిర్వహించనుందని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా సదస్సు బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. పర్యావరణ హితంతో పాటు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, ప్రకృతి వనరులు, వ్యర్థాల సమర్థ నిర్వహణ తదితరాలపై సదస్సులో చర్చిస్తారన్నారు. దాదాపు 500 మంది దేశవిదేశాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొంటారన్నారు.








