భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) కొత్త నిబంధన
విమానాశ్రయాల్లో నిబంధనలు ఉల్లంఘించేవారు ఇకపై అధిక మొత్తంలో జరిమానాలు ఎదుర్కోకతప్పదు. అతిక్రమణకు రూ.500గా ఉన్న జరిమానాను ఏకంగా రూ.5000కు పెంచుతూ భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. జరిమానా తర్వాత కూడా ఉల్లంఘన కొనసాగితే, రోజుకు రూ.500 చొప్పున అదనపు జరిమానా విధించవచ్చు. గతంలో ఇది కేవలం రూ.20 గా ఉండేది.








