కోలుకుంటున్న ఫ్లోరిడా
ఇర్మా తుపాను ప్రభావం కారణంగా ఫ్లోరిడాలోని లక్షలాది నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రాత్రిపూట ప్రజలు నానాఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఫ్లోరిడాకీస్ దీవులకు విపరీతమైన నష్టం వాటిల్లింది. ఇక్కడ ఉన్న మూడు ఆస్పత్రులు మూతపడ్డాయి. తుపాను ప్రభావిత కరేబియా దీవుల్లో మృతుల సంఖ్య 40కి, క్యూబాలో 10కి చేరుకుంది. ఉత్తర దిశగా సాగిపోయిన ఇర్మా తుపాను ఎట్టకేలకు బలహీనపడింది.








