మనుషుల స్వేదం నుంచి విద్యుచ్ఛక్తి
మనుషుల స్వేదం నుంచి శక్తిని గ్రహించి విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయగలిగే సాగే గుణమున్న విద్యుత్ ఘటా(సెల్స్)లను శాస్త్రవేత్తలు తయారుచేశారు. శరీరానికి ధరించగలిగే ఎల్ఈడీ, బ్లూటూత్ రేడియో ఉపకరణాలకు వీటితో విద్యుత్తును సరఫరా చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇలాంటి ఘటాలతో పోలిస్తే ఈ జీవ ఇంధన ఘటాలు పదిరెట్లు ఎక్కువగా సమర్థవంతంగా పనిచేగలుగుతాయి. అమెరికాలోని శాన్‌డియాగో, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజినీర్లు వీటిని తయారుచేశారు. స్వేదంలో ఉండే లాక్టిక్ఆమ్లాన్ని ఆక్సీకరణం చేయడానికి జీవ ఇంధన ఘటాల్లో ఎంజైమ్‌ను ఉపయోగించడంతో ఇది సాధ్యమైంది.








