అమెరికాలో భూ ప్రకంపనలు
అమెరికాలోని డల్లాస్, ఇర్విన్ లలో భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 6:41 గంటల ప్రాంతంలో ఓల్డ్ టెక్సాస్ స్టేడియం పరిసరాల్లోనూ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైనట్లు అమెరికన్ జియోలాజికల్ సర్వే విభాగం వెల్లడించింది. ముఖ్యంగా నార్త్ టెక్సాస్ ప్రజలు భూకంపం వల్ల ఇబ్బందులకు గురయ్యారు. హైవే నెంబర్ 114, టామ్ బ్రేనిఫ్ డ్రైవ్ ప్రాంతంలో, టెక్సాస్ తీరానికి సమీపంలోనూ భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. 2014 చివర్లో కేవలం రెండు నెలల వ్యవధిలో ఆరు పర్యాయలు ఇర్వింగ్ ఏరియాలో భూకంపాలు వచ్చాయని, ఆ తర్వాత భూ ప్రకంపనలు రావడం ఇదే తొలిసారి. నష్ట వివరాలు తెలియాల్సి ఉంది.








