మార్కెట్లోకి డొనాల్డ్ ట్రంప్ చప్పల్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో చెప్పులు మార్కెట్ లోకి వచ్చాయి. తన విలక్షణ వైఖరితో నిత్యం వివాదాలతో సహవాసం చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో చెప్పులు మార్కెట్ లోనికి రావడం సంచలనం సృష్టించింది. అధ్యక్షుడు కాక ముందు ఆయన ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు, అధ్యక్షుడు అయయిన అనంతరం గత అభిప్రాయాలకు పూర్తిగా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్లను ముద్రించి మరీ ఒక అమెరికన్ కంపెనీ ఆయన పేరుమీద చెప్పులను మార్కెట్ లోనికి విడుదల చేసి సంచలనం సృష్టించింది.













