దీపికా రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా?
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే వరుస హిట్లతో దూసుకెళ్లుతున్నది. అలాగే ఆమె సంపాదన కూడా అంతే రేంజ్లో ఉంది. 2016లో ఆమె ఫోర్బ్స్ జాబితాలోనూ చోటు సంపాదించింది. యే జవానీ హై దివానీ, చెన్నై ఎక్స్‌ప్రెస్, రామ్‌లీలా, హ్యాపీ న్యూ ఇయర్, బాజీరావ్ మస్తానీ చిత్రాలతో దీపికా టాప్ గేర్‌లో పయనిస్తున్నది. ఇక దీపికా రెమ్యూనిరేషన్ కూడా ఇప్పుడో టాపిక్‌గా మారింది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో దీపికా నటిస్తున్నది. అందులో ఆమె పద్మావతి పాత్రను పోషిస్తున్నది. ప్రస్తుతం ఈ ఫిల్మ్ షూటింగ్ కొనసాగుతున్నది. రణ్వీర్, షాహిద్ కపూర్లు కూడా ఈ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. ఈ ఫిల్మ్ కోసం దీపికా 12 కోట్లు తన పేమెంట్‌గా తీసుకున్నదట. మిడ్డే ప్రచురించిన కథనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఏడాదంతా ఆ ఫిల్మ్‌కే సమయాన్ని కేటాయించిన దీపికా అంత మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తున్నది.













