కుటుంబసభ్యులతో కలిసి ఫిదా చూసిన కేసీఆర్
తెలంగాణ అమ్మాయి, అమెరికా అబ్బాయి ప్రేమ కథతో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా చిత్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిదా అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ఫిదా మూవీని ప్రత్యేకంగా వీక్షించారు. ఫిదా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్రాజులను ముఖ్యమంత్రి అభినందించారు. నటీనటులు చక్కగా నటించారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. వీలు చూసుకుని తనను కలవాలని శేఖర్ కమ్ముల, దిల్ రాజులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు.








