అమెరికాలోనూ బాల్య వివాహాలు
అమెరికాలోనూ బాల్య వివాహాల సమస్య ఉందని నోబెల్ పురస్కార గ్రహీత, బచపన్ బచావో ఆందోళన్ వ్యవస్థాపకుడు కైలాశ్ సత్యార్థి అన్నారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు కావడంతో పాటు, గర్భదారణ జరుగుతుండడం ఆందోళనకర విషయమని అన్నారు. చాలా రాష్ట్రాల్లో వివాహానికి కనీస వయసును నిర్ధరించలేదని చెప్పారు. ఈ విషయంలో తగిన చట్టాలు రూపొందించాలని సూచించారు. బాలల హక్కుల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ బాల్యవిహాలు జరుగుతుండగా, స్వచ్ఛంద సంస్థలు అడ్డుకున్న విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. అమెరికాలోని పురాతన జాతులతో పాటు, శ్వేతజాతీయుల్లోనూ ఈ సమస్య కనిపిస్తోందని అన్నారు. అగ్రరాజ్యంలో బాల కార్మికుల సమస్యా తక్కువేమీ కాదని అన్నారు.













