వలస వచ్చిన నేతలకు శుభవార్త!
రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ (టీడీపీ, టీఆర్ఎస్)ల్లోకి వలస వచ్చిన నేతలకు శుభవార్త. అధినాయకత్వంతో సహా, పార్టీ నేతలు ఎదురు చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు సమస్యకు మోక్షం కలుగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ (ఏపీ 175 నుంచి 225, తెలంగాణ 119 నుంచి 153) సీట్లను పెంచేందుకు ఉన్న అవకాశాలను కేంద్ర హోమ్ శాఖ తీవ్రంగా ఆలోచిస్తున్నది. ఈ మేరకు ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 170వ అధికరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం అడుగులువేస్తోంది.








