కొవ్వు పెరిగితే ఎముకలకు ముప్పు
వయసు పైబడిన వారిలో ఎముకలు ఎందుకు గుళ్లబారతాయి? వృద్ధులు ఎందుకు ఎముక సంబంధ వ్యాధుల బారిన పడతారు? ఎముకల్లోని సీబీఎఫ్ బీటా కణాల సంఖ్య తగ్గడమే దీనికి కారణమని బర్మింగ్హోమ్లోని యూనివర్సిటీ ఆఫ్ అలబామా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ సీబాఎఫ్ బీటా కణాల ఉత్పత్తి నిలిచి పోయి, కొవ్వు కణాల ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు. ఎలుకలపై తాము జరిపిన పరిశోధనల్లో ఈ విషయం రుజువైందని చెప్పారు.








