కెరీర్ అనలిటిక్స్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా చేయగలిగిన కార్యక్రమాలను
జూన్ 8వ తేదీన జరిగిన ఒక కార్యక్రమం లో, అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి శ్రీ కోమటి జయరాం గారు మరియు పంచాయతీ రాజ్ కమిషనర్ శ్రీ రామాంజనేయులు గారి సమక్షం లో కెరీర్ అనలిటిక్స్ అధ్యక్షులు శ్రీ కొత్తపల్లి ఉప్పాజి గారు మరియు ఆ సంస్థ డైరెక్టర్ శ్రీ గోకుల్ రాచిరాజు గార్లు వారి సంస్థ తలపెట్టిన ప్రత్యెక శిక్షణా కార్యక్రమం గురించి వివరించారు. ఈ సందర్భంగా కెరీర్ అనలిటిక్స్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా చేయగలిగిన కార్యక్రమాలను సత్వరమే ప్రారంభించాలని శ్రీ రామాంజనేయులు గారు అభిప్రాయ పడ్డారు. సంస్థ ప్రతినిధి ఊప్పాజీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాకరంగా తీసుకుని వెంటనే ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికని ప్రభుత్వం ముందు వుంచుతానని తెలిపారు. ఈ సందర్భంగా ఇదే విషయం పై తాము ఆంధ్రప్రదేశ్ స్కిల్ల్ డెవలప్మెంట్ ప్రతినిధి శ్రీమతి టి లక్ష్మి గారితో సంప్రదించినట్లు తెలిపారు. ఇంకా ఉప్పాజీ గారు మాటలాడుతూ, ఈ కార్యక్రమానికి ప్రేరణ తాను శ్రీ జయరాం కోమటి గారి నుండి పొందానని చెప్తూ, ఈ ఆఅశయ సాధనలొ శ్రీ జయరాం గారిని తమకు మార్గ నిర్దేశం చెయ్యాలని తమ బోర్డు లోనికి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమం లో శ్రీ యుతులు పైలా ప్రసాద్ గారు మరియు ప్రత్తిపాటి వీరబాబు గార్లు పాల్గొని పలు సూచనలు చేశారు.








