థర్డ్ హ్యాండ్ స్మోక్తో కాలేయానికి హాని
సిగరెట్ తాగిన వాళ్లకు, పక్కనున్న వాళ్లకే కాదు, సిగరెట్ బూడిద కూడా ప్రమాదమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దానివల్ల కాలేయం, మెదడు కణజాలాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. ఒక్క నెలలోనే ఊపిరితిత్తులు పాడవటం, టైప్-2 మధుమేహం, అధిక చురుకుదనం సమస్యలు తలెత్తే అవకాశమూ ఉందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు అంటున్నారు. ఎలుకలపై చేసిన పరిశోధనల్లో థర్డ్ హ్యాండ్ స్మోక్తో వాటి మానసిక, శారీరక స్థితిగతులు మారినట్లు గుర్తించామని వివరించారు.








