డ్రగ్స్‌లో దొరక్కుండా ఉండేందుకు అమెరికన్ పాప్ గాయని గుండు
ప్రస్తుతం భర్తతో విడిపోయి, పిల్లల సంరక్షణ తనకు అప్పగించాలని కోర్టులో వేడుకుంటున్న అమెరికన్ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ తన తెలితేటలను ప్రదర్శించింది. గతంలో యాంఫిటమైన్ డ్రగ్స్ వాడిన ఆమె ఆ విషయం విచారణలో తేలకుండా ఉండేందుకు గుండు కొట్టించుకుంది. డ్రగ్స్ తీసుకుంటే, దాని అవశేషాలు రక్తంలో నాలుగు రోజులు మాత్రమే ఉంటాయి. లాలాజలంలో మూడు రోజుల వరకూ ఉండే యాంఫిటమైన్ ఆవశేషాలు, కురులలో అయితే, మూడు నెలల వరకూ ఉంటాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె గుండు కొట్టించుకుంది. మత్తుమందుల అవశేషాలు కురులలో లభిస్తే తన పిల్లల సంరక్షణ మాజీ భర్త కెవిన్ ఫెడర్టైన్కు అప్పగిస్తారన్న భయంతోనే అమె ఈ పని చేసినట్లు తెలుస్తోంది.కాగా, హెరాయిన్, మారిజువానా, కొకైన్ తదితర మాదకద్రవ్యాలు వాడితే దాని అవశేషాలు 90 రోజుల వరకూ వెంట్రుకల్లో ఉంటాయి.













