ఫ్రెషర్లకు టీసీఎస్ గుడ్ న్యూస్…
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ (టీసీఎస్) ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్రెష్ ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు వరంలాంటి వార్తను ప్రకటించింది. కరోనా కష్టకాలంలో ఉద్యోగార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది. ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్ కింద ఎంబీఏ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అవకాశం ప్రత్యేకించి 2019-20, 2020-21, 2021-22 బ్యాచ్‌లలో పాసవుట్ అయిన ఎంబీఏ గ్రాడ్యుయేట్స్‌కే కేటాయించింది. ఉద్యోగార్థులు టీసీఎస్ పోర్టల్ ద్వారా ఎంబీఐ హైరింగ్‌లో భాగం కావచ్చు. నవంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. 18 నుంచి 28 ఏళ్ల వరకు వయస్సు పరిమితిని విధించారు. ఉద్యోగార్థులు రెండేళ్ల ఎంబీఏ కోర్సును పూర్తి చేయడంతో పాటు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీలలో 60 శాతం మార్కులతో పాస్ కావాల్సి ఉంటుంది. బీటెక్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది.













