చరిత్ర సృష్టించిన తెలుగు అమ్మాయి

భారత టేబుల్ టెన్నిస్ స్టార్, తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ చరిత్ర సృష్టించింది. డబ్ల్యూటీటీ కంటెండర్ సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి భారత టీటీ ప్లేయర్గా రికార్డు నమోదు చేసింది. అంతేగాక, డబుల్స్ టైటిల్ను కూడా శ్రీజ నెగ్గింది. అర్చనా కామన్తో కలిసి డబుల్స్ పసిడి సాధించింది. దీంతో ఒకే టోర్నీలో రెండు స్వర్ణాలు గెలిచిన భారత ప్లేయర్గా ఘనత సాధించిది. మహిళల డబుల్స్లోనూ పసిడి నెగ్గిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఒకే టోర్నీలో రెండు స్వర్ణాలు గెలిచిన తొలి భారత ప్లేయర్గా ఘనత సాధించింది. నైజీరియాలో జరిగిన టోర్నీలో మహిళల సింగిల్స్లో పైనల్లో చైనా క్రీడాకారిణి డిరగ్ యిజీని శ్రీజ చిత్తుగా ఓడిరచింది. 4`1తో విజయం సాధించింది. 10`12తో తొలి సెట్లో ఓడిన శ్రీజ తర్వాత చెలరేగింది. 11`9, 11`6, 11`8, 11`16తో వరుసగా విజయ ఢంకా చెలరేగింది. ఇక డబుల్స్ తుదిపోరులో అర్చనాతో కలిసి శ్రీజ గెలుపుతీరాలకు చేరింది.