పెద్దల సభకు సోనియా గాంధీ ?
కాంగ్రెస్ అగ్రనేత, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఇక ప్రత్యక్ష ఎన్నికలకు దూరం కానున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా పోటీ చేయరని పార్టీ వర్గాల సమాచారం. కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేయన్నుట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం 2024 ఏప్రిల్ 2వ తేదీనాటికి ముగియనుంది. ఇటీవల సోనియాగాంధీ బెంగళూరు వచ్చిన సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ముందు రాజ్యసభ ప్రతిపాదన పెట్టారు. అయితే, సోనియా స్పందించలేదని సమాచారం. సిద్ధరామయ్య ప్రతిపాదనకు సోనియా అంగీకారం తెలిపే అవకాశముందని చర్చ నడుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆమె ఓ నిర్ణయానికి వచ్చారని, అయితే రాజకీయాల నుంచి వైదొలగనని స్పష్టమైన సంకేతాలిచ్చినట్టు సమాచారం.













