విద్యార్థులపై బల ప్రయోగం.. పార్లమెంట్ లో రచ్చ రచ్చ
విద్యార్థుల నిరసనలు, విద్యార్థులపై పెల్లెట్ల వినియోగం, లాఠీఛార్జీ అంశాలు లోక్ సభను తీవ్రంగా కుదిపేశాయి. ఇదే విషయంపై అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికే దారితీశాయి. విద్యార్థులపై కాల్పులు జరపడానికి, బలప్రయోగం చేయడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాయే ఆదేశాలు ఇచ్చారని రాహుల్ ఆరోపించడంతో వివాదం రేగింది.
అంతేకాకుండా రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఓ పదం వాడటం కూడా తీవ్ర వివాదానికి దారి తీసింది. దీంతో అధికారపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.యువత ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని, అయితే వారి సెంటిమెంట్ ను అన్ని పార్టీలూ గౌరవించాయని రాహుల్ అన్నారు. పేపర్ లీక్ తో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, తీవ్ర వేదన తర్వాతే నిరసన బాట పట్టారన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని రెచ్చగొట్టేలా పోలీసులు ప్రవర్తించారని ఆరోపించారు. ఢిల్లీ వీధుల్లో జరిగింది నిరసన కాదని.. భావ వ్యక్తీకరణ అని పేర్కొన్నారు. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేశారని తెలిపారు. విద్యార్థుల ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు.
విద్యార్థుల ఆందోళనను రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు గౌరవించాలని రాహుల్ పిలుపునిచ్చారు. తీవ్ర వేదన తర్వాతే విద్యార్థులు ఆందోళన చేశారని.. కానీ వారి నిరసనను కేంద్రం అర్థం చేసుకోలేదని విమర్శించారు. వారి ఆవేదనను పట్టించుకోలేదనే విద్యార్థులు రోడ్లపైకి వచ్చారని వివరించారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, హింసించారని మండిపడ్డారు.
రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రుల తీవ్ర అభ్యంతరం
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, మరో మంత్రి జితేంద్ర సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీ ఆరోపణలకు ఆధారాలు వుంటే సభ ముందు వుంచాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాల్లేకుండా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ హత్య చేశారని తాను కూడా చెప్పగలని అన్నారు. ఆధారల్లేకుండా ఎవరిపైనా ఏ ఆరోపణ అయినా చేయవచ్చన్నారు. అందుకే ఈ ఉదాహరణ చెప్పానని రిజిజు క్లారిటీ ఇచ్చారు.
ఆదేశాలు ఇచ్చేది మేజిస్ట్రేట్.. మంత్రి కాదు : జితేంద్ర సింగ్
నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేవలం బాష్పవాయువు మాత్రమే ప్రయోగించామని కేంద్ర ప్రభుత్వం తరపున జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఎలాంటి కాల్పులూ జరపలేదన్నారు. జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, నిరసనకారులపై బలప్రయోగానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుమతి ఇచ్చారన్న రాహుల్ గాంధీ ఆరోపణలను తోసిపుచ్చారు; అటువంటి ఆదేశాలు జారీ చేసే అధికారం మంత్రికి కాకుండా మేజిస్ట్రేట్‌కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి ఏమాత్రం పరిపాలనా అనుభవమే లేదని దెప్పిపొడిచారు.








