భారత ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాం

భారత సార్వత్రిక ఎన్నికలను తాము ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది. ఢిల్లీలో ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో మన దేశంలో జర్మనీ రాయబారి ఫిలిఫ్ అకెర్‌మాన్ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ/ కూటమి గెలిచినా అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రభావం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.