సోనియా గాందీతో ముగిసిన ఈడీ విచారణ… మరోసారి
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఈడీ విచారణ ముగిసింది. నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీ సెంట్రల్ ఢిల్లీ లోని అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ ప్రధాన కార్యాలయానికి సోనియా తన జడ్ ప్లస్ కేటగిరి భద్రతలో చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. సోనియా గాంధీ నేటి ఈడీ విచారణ ముగిసింది. సోమవారం మరోసారి విచారణకు రావాలని ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది. కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలిని దర్యాప్తు సంస్థలు విచారించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అదనపు డైరెక్టర్ స్థాయి మహిళా అధికారి నేతృత్వంలోని అయిదుగురు అధికారుల బృందం సోనియాను ప్రశ్నించింది. సోనియాగాంధీ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు సహాయకారిగా ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అనుమతిచ్చింది. విచారణ సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. ఇదే కేసులో ఇటీవల రాహుల్ గాంధీని కూడా ఈడీ విచారించిన విషయం తెలిసిందే. మొత్తం 5 రోజుల్లో 10 గంటలపాటు రాహుల్‌ను అధికారులు ప్రశ్నించారు.













