రూ.450 కోట్ల భారీ విరాళం ఇచ్చిన దాతలు
భారతీయ విజ్జాన సంస్థ(ఐఐఎస్సీ) బెంగళూరులో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్కూల్, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించి ఇంటిగ్రేటెడ్ సైన్స్, ఇంజినీరింగ్, వైద్య సేవలను ఒకే ఆవరణలో అందించనుంది. ఈ ఆసుపత్రి ఏర్పాటుకు దాతలు సుబ్రొతో బాగ్చి, పార్థసారథిలు రూ.450 కోట్ల భారీ విరాళాలిచ్చినట్లు తెలిపారు. బాగ్చి-పార్థసారథి హాస్పిటల్ పేరిట స్థాపించే నిర్మాణాన్ని జూన్లో ప్రారంభించి 2024 నాటికి పూర్తి చేస్తామన్నారు. 800 పడకలతో నిర్మించే ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు, క్లినికల్ సైన్సెస్, బేసిక్ సైన్సెస్, ఇంజినీరింగ్, టెక్నాలజీ సైన్స్ పరిశోధనలు చేపట్టనున్నారు. కొత్తతరం ఫిజీషియన్ సైంటిస్ట్లను తయారు చేసే ఎండీ`పీహెచ్డీ ప్రోగ్రాంలను ఈ మెడికల్ స్కూల్ ద్వారా నిర్వహించనున్నట్లు ఐఐఎస్సీ డైరెక్టర్ ఆచార్య గోవిందన్ రంగరాజన్ ప్రకటించారు.













