కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించిన యూపీ సీఎం యోగి
దీపావళి పర్వదినం సందర్భంగా అయోధ్యలో జరిగే దీపోత్సవ్ను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆహ్వానించారు. అయోధ్య నగరం అంతటా 12 లక్షల దీపాలు (మట్టి దీపాలు) వెలిగించి ఈ వేడుక నిర్వహించడం ద్వారా రికార్డు సృష్టించనున్నారు. దీపావళి రోజున సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కీ పైడి ఘాట్ వద్ద 9 లక్షల దీపాలు, ఆ నగరంలోని పలు ప్రదేశాల్లో 3 లక్షల దీపాలను వెలిగిస్తారు. 14 ఏళ్ల అజ్ఞాత వాసం నుంచి రాముడు తన భార్య సీత, సోదరుడు లక్ష్మణుడితో కలిసి లంకలో రావణుడిని ఓడిరచి తన రాజ్యానికి తిరిగి వచ్చిన సందర్భంగా వారిని స్వాగతిస్తూ దీపావళి పండుగను జరుపుకుంటారు.













