ఇస్రో మరో కీలక ప్రయోగం
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైంది. ఈ ప్రయోగంపై ఉత్సాహంతో ఉన్న ఇస్రో మరో కీలక ప్రయోగానికి సన్నద్ధమవుతున్నది. ఇకపై సూర్యుడిపై పరిశోధనలు జరుపనున్నది. ఇందు కోసం ఆదిత్య మిషన్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించే అవకాశం ఉందని ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ వెల్లడించారు. సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య మిషన్‌ను సెప్టెంబర్ లో తొలి ప్రయోగం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదిత్య మిషన్ కోసం సన్నద్ధమవుతుందని తెలిపారు. గగన్‌యాన్ ప్రాజెక్టు ఇంకా ప్రోగ్రెస్‌లో ఉందని, త్వరలోనే ఈ ప్రాజెక్టును చేపడుతామని తెలిపారు. సెప్టెంబర్ లేదంటే అక్టోబర్‌లో ఏదో ఒక మిషన్‌ను చేపడుతామని ప్రకటించారు.













