Amit Shah: ఆనంద్పూర్ ఘటనకు ప్రభుత్వదే బాధ్యత: దీదీపై అమిత్ షా ఫైర్
పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) శనివారం బెంగాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee), టీఎంసీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కోల్కతా శివారులోని ఆనంద్పూర్లో జరిగిన విషాదకర ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వానిదేనని అమిత్ షా (Amit Shah) ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం భద్రతా ప్రమాణాలను గాలికొదిలేసిందని, ప్రజల ప్రాణాల కంటే ఓటు బ్యాంకు రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని మండిపడ్డారు. “వందేమాతరం” (Vande Mataram) నినాదాన్ని వ్యతిరేకిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఇదే సమయంలో బెంగాల్లో అక్రమ చొరబాట్లు (Infiltration) ప్రధాన సమస్యగా మారాయని, వచ్చే 2026 ఎన్నికల్లో ఇదే కీలక అంశమని అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. తమను గెలిపిస్తే 45 రోజుల్లోగా ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, చొరబాట్లను పూర్తిగా అరికడతామని హామీ ఇచ్చారు. కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు భూ సేకరణ జరిపి భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు. పాత తప్పుల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవడం లేదని ఆయన (Amit Shah) ఆగ్రహం వ్యక్తం చేశారు.






