ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన శ్రీలంక
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు వరల్డ్ కప్‌లో ఘోర అవమానం జరిగింది. శ్రీలంకతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో ఆ జట్టు కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. బ్యాటింగ్‌కు స్వర్గధామం వంటి స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ జట్టులో జానీ బెయిర్‌స్టో (30), డేవిడ్ మలాన్ (28), బెన్ స్టోక్స్ (43), మొయీన్ అలీ (15), డేవిడ్ విల్లే (14 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా స్టార్ బ్యాటర్లు అందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. దీంతో ఇంగ్లండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక స్టార్ ప్లేయర్లు కుశాల్ పెరీరా (4), కుశాల్ మెండిస్ (11) విఫలమయ్యారు. అయితే మరో ఓపెనర్ పాథుమ్ నిస్సంక (77 నాటౌట్), సదీర సమరవిక్రమ (65 నాటౌట్) అద్భుతంగా ఆడి శ్రీలంకను విజయతీరాలకు చేర్చారు. లంక టీం కేవలం 25.4 ఓవర్లలోనే 160 పరుగులు చేసి, ఇంగ్లండ్‌పై ఏకంగా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. బంతితో అద్భుతంగా రాణించిన శ్రీలంక పేసర్ లాహిరు కుమారకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













