సోనియా గాంధీ, రాహుల్ కు భారీ షాక్..
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ హెరాల్డ్ హౌజ్ బిల్డింగ్లో ఉన్న యంగ్ ఇండియన్ ఆఫీస్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సీల్ వేసింది. మనీల్యాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఆఫీస్ ప్రాంగణం తెరవరాదని ఆదేశాలు జారీ చేసింది ఈడీ. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ గంటల తరబడి ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా న్యూఢిల్లీ లోని హెరాల్డ్ హౌజ్లో సోదాలు సైతం నిర్వహించింది. ఈ క్రమంలో యంగ్ ఇండియన్ లిమిటెడ్ ఆఫీస్కు సీల్ వేసింది ఈడీ. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపించిన అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ నుంచి యంగ్ ఇండియన్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు గరిష్ఠ వాటాలు ఉన్నాయి.













