ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈడీ విచారణ ముగిసింది. దీంతో ఈడీ కార్యాలయం నుంచి ఆమె బయటకు వచ్చేశారు. ఈ కేసులో సోనియాను ఇప్పటి వరకు ఈడీ మూడు రోజులు విచారించింది. మొత్తం 12 గంటల పాటు సోనియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఆ సమయంలో ఆమెను వందకుపైగా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. 75 ఏళ్ల సోనియా మూడవ రోజున ఈడీ ఆఫీసులో మూడు గంటల పాటు విచారణను ఎదుర్కొన్నారు. ఆరుగంటలు విచారణను ఎదుర్కోగా ఆమె చాలా వేగంగా సమాధానాలు ఇచ్చినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. అయితే నేటితో ఆమె విచారణ ముగిసినట్లే తెలుస్తోంది. మరోసారి విచారణకు హాజరు కావాలని సోనియాకు తాజా సమన్లు జారీ చేయలేదు.













