రాజ్యసభకు అభ్యర్థులకు ప్రకటించిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాలకు దక్కని చోటు
ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. గుజరాత్ నుంచి బాబు బాయి జేసంగ్ బాయ్, కే శ్రీదేవన్స్ జాలా, బెంగాల్ నుంచి అనంత్ మహారాజ్‌కు అవకాశం ఇచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. కాగా ఇప్పటికే గుజరాత్ నుంచి కేంద్ర మంత్రి జై శంకర్ పేరును నామినేట్ చేసిన విషయం తెలిసిందే. జులై 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో ఆరు స్థానాలకు, గుజరాత్లో మూడు, గోవాలో ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.













