పోటాపోటీగా బీహార్ అసెంబ్లీ పోరు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు పోటాపోటీగా మారింది. ఎన్డీఏ, మహాఘట్బందన్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఓట్ల లెక్కింపు సాగుతోంది. 243 స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీలో ఇవాళ కౌంటింగ్ జరుగుతోంది. అయితే తొలి సమాచారం ప్రకారం.. ఎన్డీఏ 123 స్థానాల్లో, మహాఘట్బందన్ 109 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. దీంతో బీహార్ పోరు రసవత్తరంగా మారినట్లు తెలుస్తోంది. సీఎం నితీశ్ కుమార్‌కు .. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ గట్టి పోటీ ఇస్తున్నారు. మహాఘట్బందన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి దూసుకెళ్తున్నారు. తొలుత మహాఘట్బందన్ లీడింగ్‌లో ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. తరువాత నితీశ్ నేత•త్వంలోని ఎన్డీఏ కూటమి గేర్ మార్చింది. మెల్లమెల్లగా ఆ కూటమి బలం పుంజుకుంటున్నది. తాజా సమాచారం ప్రకారం మహాఘట్బందన్ను ఎన్డీఏ కూటమి దాటేసింది.













