Baloch Attacks: పాకిస్థాన్‌లో చైనా, అమెరికాల ఆస్తులపై బలోచ్ రెబల్స్ దాడి!
పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో శనివారం జరిగిన వరుస బాంబు దాడులు (Baloch Attacks) ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశాయి. దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనివిధంగా బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) రెబల్స్ భారీ ఎత్తున విరుచుకుపడ్డారు. ఈ దాడులను బలోచ్ రెబల్స్ ‘ఆపరేషన్ హెరోఫ్’ (Operation Herof) అని పిలుస్తున్నారు. ఈ దాడులు పాకిస్థాన్‌తో పాటు చైనా, అమెరికాలకు కూడా గట్టి హెచ్చరిక అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బలోచిస్థాన్‌లోని (Baloch Attacks) సహజ వనరులు, ఖనిజ సంపదపై కన్నేసిన చైనా, అమెరికాలు అక్కడ భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా చైనా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్’ (CPEC) ఈ ప్రాంతం గుండానే వెళ్తుంది. తమ ప్రాంత వనరులను విదేశీ శక్తులు దోచుకుంటున్నాయని ఆరోపిస్తున్న బీఎల్ఏ.. ఆ పెట్టుబడులను అడ్డుకోవడమే లక్ష్యంగా దాడులు (Baloch Attacks) చేస్తోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
శనివారం జరిగిన దాడుల్లో సుమారు 800 నుండి 1,000 మంది రెబల్స్ (Baloch Attacks) పాల్గొన్నట్లు సమాచారం. పోలీసు స్టేషన్లు, సైనిక స్థావరాలు, రైల్వే లైన్లే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో మృతుల సంఖ్య 200 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. చైనా, అమెరికా తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచించుకోవాల్సిన పరిస్థితిని ఈ దాడులు కల్పించాయి.






