అమెరికా ఉపాధ్యక్షురాలికి కరోనా పాజిటివ్

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కరోనా (57) బారిన పడ్డారు. రాపిడ్, పీసీఆర్ పరీక్షలు రెండిరట్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. అయితే వ్యాధి లక్షణాలేవీ కన్పించలేదు. నెగెటివ్‌గా తేలే దాకా ఆమె ఐసోలేషన్‌లో ఉంటూ ఇంటినుంచే పని చేయనున్నారు. కమలా నుంచి అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్యకు కరోనా సోకే ప్రమాదమేమీ లేదని ఆమె ప్రెస్ సెక్రెటరీ కిర్‌స్టెన్ అలెన్ తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి వారిని ఆమె కలవలేదని వివరించారు. కమల కరోనా రెండు డోసులతో పాటు రెండు బూస్టర్ డోసులు కూడా వేసుకున్నారు. ఆమె భర్త డగ్ ఎమోప్ నెల క్రితమే కరోనా బారిన పడి కోలుకున్నారు. అదే సమయంలో పలువురు మంత్రులు, వైట్‌హౌస్ ఉన్నతాధికారులకూ కరోనా సోకింది.