కొవిడ్ కు కొత్త ఔషధం..
కొవిడ్-19తో వచ్చే అనేక దుష్ప్రభావాలను నివారించే సత్తా ఉన్న ఒక కొత్త ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికా, స్పెయిన్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 4-ఫినైట్బుటిరిక్ యాసిడ్ (4పీబీఏ) అనే ఈ ఔషధం. తీవ్రస్థాయి కొవిడ్ కేసుల్లో తలెత్తే ఇన్ఫ్లమేటరీ ప్రతిస్పందనను నియంత్రించడంలో కీలక పాత్ర పోసిస్తుందని వారు గుర్తించారు. జంతువుల్లో నిర్వహించిన పరిశోధనల్లో ఈ మేరకు తేలిందన్నారు. తీవ్రస్థాయి కొవిడ్ బాధితుల్లోని శరీర రోగ నిరోధక వ్యవస్థ భారీగా, అపరిమితంగా సైటోకైన్లను విడుదల చేస్తుంది. దీనివల్ల రక్తనాళాలు దెబ్బతిని, బహుళ అవయవ వైఫల్యం తలెత్తవచ్చు. తీవ్రస్థాయి కరోనా బాధితుల్లో చికిత్సకు ఈ సైటోకైన్ తుపాను ను నియంత్రించడం చాలా ముఖ్యం. కణ ఒత్తిడిని తగ్గించే సామర్థ్యం 4-పీబీఏ ఔషధానికి ఉందని గుర్తించినట్లు పరిశోధనలో పాలుపంచుకున్న ఇవాన్ దురాన్ చెప్పారు. బైండింగ్ ఇమ్యునోగ్లోబులిన్ ప్రొటీన్ (బీఐపీ) కణ ఒత్తిడి స్థాయిని సూచిస్తుందని కూడా తమ పరిశోధనలో తేలిందన్నారు.






