ఒకరి నుంచి 406 మందికి…

కరోనా జాగ్రత్తలు పాటించకపోతే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి 406 మందికి వైరస్‍ను అంటించే ప్రమాదముందని పరిశోధనల్లో తేలింది. కరోనా సోకిన రోగి 100 శాతం జాగ్రత్తలు పాటిస్తే అతడి నుంచి ఒక్కరికి కూడా వైరస్ సోకదని తేలింది. కోవిడ్ నిబంధనలను 50 శాతం పాటించినా కేవలం 15 మందికే వైరస్ వ్యాపిస్తుందని, ఇక 75 శాతం జాగ్రత్తలు పాటిస్తే ముగ్గురికి మాత్రమే వైరస్ వ్యాపిస్తుందని వైద్య నిపుణులు తేల్చారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లు వాడి వైరస్ వ్యాప్తి తీవ్రతను తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు.