వ్యాక్సిన్ పరిశోధనల హ్యాకింగ్‌పై మైక్రోసాఫ్ట్ ఆందోళన
రష్యా, ఉత్తర కొరియాలకు చెందిన కొంతమంది హ్యాకర్లు కొన్ని ప్రముఖ ఔషధ తయారీ సంస్థలు, వ్యాక్సిన్ పరిశోధకుల నుంచి విలవైన సమాచారం తస్కరించే ప్రయత్నం చేసినట్టు తాము గుర్తించామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. గత కొన్ని నెలలుగా జరిగిన ఇలాంటి ప్రయత్నాలు విఫలమైనట్లు తన బ్లాగ్ పోస్టులో మైక్రోసాఫ్ట్ తెలిపింది. వ్యాక్సిన్ తయారీదారులను లక్ష్యంగా చేసుకొని చైనా హ్యాకర్లు కూడా ఈ కుటిల యత్నాలు చేసినట్టు గత జులైలోనే అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. హ్యాకర్లకు ఆయా దేశాల్లో స్థానికంగా రాజకీయ మద్దతు ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. వీరికి కెనడా, ఫ్రాన్స్, ఇండియా, దక్షిణ కొరియా, అమెరికా లక్ష్యాలుగా ఉన్నాయని తెలిపింది.






