దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 16,488 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,79,979కు పెరిగింది. కొత్తగా 12,771 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,07,63,451 మంది కోలుకున్నట్లు తెలిపింది. కరోనా మహమ్మారి బారినపడి మరో 113 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,56,938కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,59,590 ఉన్నాయని కేంద్రం తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 1,42,42,547 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు వివరించింది.