దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. 24 గంటల్లో 12,584 కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది జూన్ తర్వాత అతి తక్కువగా పాజిటివ్ కేసులు రికార్డవడం ఇదే తొలిసారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,79,179కు పెరిగింది. తాజాగా 18,358 మంది కోలుకోగా ఇప్పటి వరకు 1,01,11,294 మంది డిశ్చార్జి అయ్యారని చెప్పింది. కొత్తగా మరో 167 మంది మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 1,51,327కు పెరిగాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసులు 1,04,79,179 ఉన్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా 24 గంటల్లో 8,97,056 టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 18,26,52,887 శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది.