కరోనా టీకా పంపిణిపై.. కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‍ను మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలలో అన్ని రోజులూ టీకా పంపిణీ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ మొత్తం వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గెజిటెడ్ సెలవు రోజుల్లోనూ టీకా అందజేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ వ్యాక్సిన్ కేంద్రాల్లో ప్రతి రోజూ వ్యాక్సినేషన్ నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొంది. ఇందుకోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అత్యంత వేగంగా ఎక్కువ మందికి టీకాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.