తెలంగాణలో కొత్తగా 1,021 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 30,210 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,021 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,13,084కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడదుల చేసింది. కరోనాతో ఆరుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,228కి చేరింది. కరోనా బారి నుంచి ఒక్కరోజే 2,214 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,87,342కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 24,514 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 20,036 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 35,77,261కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 228, మేడ్చల్ 84, రంగారెడ్డి 68 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.






