తెలంగాణలో 1,811 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,811 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మ్తొం బాధితుల సంఖ్య 60,717కు చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ కరోనా సమాచారాన్ని విడుదల చేసింది. కరోనాతో నిన్న ఒక్కరోజే 13 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 505కు చేరింది. కరోనా నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 821 మంది డిశ్ఛార్జి అయ్యారు. మొత్తం ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 44,572కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం 18,263 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు బులిటెన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 4,16,202 కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా నమోదైన వాటిలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 521, రంగారెడ్డి జిల్లాలో 289, మేడ్చల్‌లో 151, వరంగల్ అర్బన్‌లో 102, కరీంనగర్లో 97, నల్గొండలో 61, మహబూబ్‌నగర్‌లో 41 కేసులు నమోదయ్యాయి.






