ఏపీలో కొత్తగా 5,120 మందికి పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 66,769 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 5,120 మంది కరోనా బారినపడగా 34 మంది కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు సంఖ్య 7,34,427 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 6,349 మంది బాధితులు కొవిడ్ బారినుంచి కోలుకోగా, ఇప్పటివరకు మొత్తంగా 6,78,828 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో కరోనా బారినపడి ఇప్పటివరకు 6,086 మంది ప్రాణాలు కోల్పోగా.. 46,513 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 62,83,009 కొవిడ్ నమూనాలు పరీక్షించినట్లు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదుగురు, అనంతపురం, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున, కడప, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ప్రకాశం జిల్లాల్లో ఒకరు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.






