ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 56,145 నమూనాలను పరీక్షించగా 4,256 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రం వ్యాప్తంగా కొవిడ్ సోకిన వారి సంఖ్య 7,23,512కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 38 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. కృష్ణా జిల్లాలో 7 మంది, చిత్తూరు 5, కడప 5, గుంటూరు 4, విశాఖపట్నం 4, తూర్పుగోదావరి 3, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,019కి చేరింది. ఒక్కరోజులో 7,558 మంది కరోనా నుంచి పూర్తి కోలుకున్నారు. ఇప్పటి వరకు 61,50,351 నమూనాలను పరీక్షించినట్లు అధికారులు బులెటిన్లో పేర్కొన్నారు.






