ఏపీలో 6,242 మందికి పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. గతంలో రోజుకు 10 వేలకు పైనే నమోదు కాగా, ఇప్పుడు ఆరు వేలకు తగ్గింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 వరకు 72,811 మందికి పరీక్షలు చేయగా 6,242 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకూ మొత్తం 60,94,206 పరీక్షలు చేశారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,256కి చేరింది. ఒక్క రోజులో 7,084 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు 6,58,875 మంది కోలుకున్నారు. 39 మంది మృతితో మొత్తం మరణాలు 5,981కి చేరాయి. యాక్టివ్ కేసులు 54,400 ఉన్నాయి. మిలియన్ జనాభాకు 1,14,124 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.






