ఏపీలో మరో 8,555 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 6,272 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు వైద్యరోగ్యశాఖ బులెటిన్లో వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 82,886 కు చేరింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 వరకు 52,834 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షలు 20,65,407కు చేరాయి. కొత్తగా 8,555 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,58,764కి చేరింది. తాజాగా 67 మంది మృతితో మొత్తం మరణాలు 1,474కి చేరాయి. యాక్టివ్ కేసులు 74,404 ఉన్నాయి.






