చైనాలో మళ్లీ విజృంభణ..
కరోనా మహమ్మారికి పుట్టిల్లయిన చైనాలో, ఈ వైరస్ మళ్లీ ప్రతాపం చూపిస్తోంది. నిన్నటిదాకా పదుల సంఖ్యకే పరిమితమైన కొత్త కేసులు, ఇప్పుడు 100 మార్కును దాటేశాయి. షిన్జియాంగ్ ప్రాంతంలోనే 89 కేసులు నమోదైనట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. గత మూడు నెలల కాలంలో ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదవడం ఇదే తొలిసారి. చైనాలా చివరగా ఏప్రిల్ 13న ఒకేరోజు 108 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. అయినా, ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయా చోట్ల కఠిన లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు చైనాలో మొత్తం 84,060 కోవిడ్ కేసులు నమోదవగా, మృతుల సంఖ్య 4,634గా ఉన్నది.






