మే 3న రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో TFAS ఉగాది వేడుకలు
TFAS: న్యూజెర్సీలోని తెలుగు కళా సమితి (TFAS) ఆధ్వర్యంలో ‘శ్రీ పరాభవ నామ సంవత్సర’ ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలు మే 3, 2026 ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఫోర్డ్స్లోని ప్రఖ్యాత ‘రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్’ వేదికగా జరగనున్నాయి.
ఆర్పీ పట్నాయక్ టీంతో మ్యూజికల్ నైట్..
ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు , గాయకుడు శ్రీ ఆర్పీ పట్నాయక్ తన బృందంతో కలిసి సంగీత విభావరిని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు,
- అమృత స్వర బ్రహ్మ డాక్టర్ టి. శరత్ చంద్ర
- ప్లేబ్యాక్ సింగర్ శ్రీకాంత్ సండుగు
- ప్లేబ్యాక్ సింగర్ మనోజ్ఞ బెల్లంకొండ
- ప్లేబ్యాక్ సింగర్ ధృతి కామరాసు పాల్గొని ప్రేక్షకులను అలరించనున్నారు.
టికెట్ల వివరాలు..
ఈ కార్యక్రమానికి నేరుగా (In person) హాజరుకావడంతో పాటు ఆన్లైన్లో కూడా వీక్షించే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. టికెట్ల కోసం TFAS అధికారిక వెబ్సైట్ లేదా సులేఖ డాట్ కామ్ సందర్శించవచ్చు. 4 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు కొనుగోలు చేసే వారికి గ్రూప్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
TFAS బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ..
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు మధు అన్న, వెంకట సత్య తాతా, వాణి కునిశెట్టి, లోకేందర్ గిరకల, శేషగిరి రావు కంభంమెట్టు, లతాదేవి మడిశెట్టి, అరుంధతి షాకెల్లి, వరలక్ష్మి రాధాకృష్ణ, ప్రసాద్ వూటుకూరు తదితర బోర్డు సభ్యులు కృషి చేస్తున్నారు. ఈ వేడుకలకు ప్రవాస తెలుగువారందరూ హాజరై ఉగాది సంబరాలను జరుపుకోవాలని తెలుగు కళా సమితి ప్రతినిధులు ఆహ్వానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








