న్యూజెర్సీలో ఘంటసాల సంగీత విభావరి.. ఏప్రిల్ 22 నుంచి శిక్షణ తరగతులు
TFAS: న్యూజెర్సీలోని తెలుగు కళా సమితి (TFAS) ఆధ్వర్యంలో అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాటలు , పద్యాలపై ప్రత్యేక శిక్షణ తరగతులను (వర్క్‌షాప్) నిర్వహిస్తున్నారు. ఘంటసాల స్వర పరిశోధకులు, “స్వర సామ్రాట్” డాక్టర్ టి. శరత్ చంద్ర ఈ శిక్షణను అందించనున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు:
- తేదీలు: ఏప్రిల్ 22 నుండి 27, 2026 వరకు.
- సమయం: ప్రతిరోజూ సాయంత్రం 6:00 గంటలకు.
- వేదిక: శ్రీ గంగాధర్ దేశు నివాసం, 11 ఆర్లింగ్టన్ కోర్ట్, వారెన్, NJ 07059.
రిజిస్ట్రేషన్: పిల్లలు, పెద్దలు ఎవరైనా దీనిలో పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు $100. ఆసక్తి ఉన్నవారు https://tinyurl.com/2026TFASGhantasala ద్వారా నమోదు చేసుకోవచ్చు.
ఈ శిక్షణ పొందిన వారికి మే 3న జరిగే ఉగాది వేడుకల్లో ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంటుంది.
సంప్రదించాల్సిన వ్యక్తులు:
మరింత సమాచారం కోసం శ్రీమతి వరలక్ష్మి శ్రీనివాస్ (774-288-9365) లేదా ప్రసాద్ వూటుకూరు (732-789-0272) లను సంప్రదించగలరు. శరత్ చంద్రను +91 95422 44456 (వాట్సాప్ ద్వారా) కూడా సంప్రదించవచ్చు.
ఈ కార్యక్రమంలో TFAS బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (2024-2026) సభ్యులు మధు అన్న, లోకేందర్ గిరకల, అరుంధతి శకెల్లి, వెంకట సత్య తాతా, శేషగిరిరావు కంభంమెట్టు, వరలక్ష్మి రాధాకృష్ణ, వాణి కునిశెట్టి, లతాదేవి మడిశెట్టి , ప్రసాద్ వూటుకూరు తదితరులు పర్యవేక్షిస్తున్నారు.








