ఇండో అమెరికన్లతో సమావేశమైన భారత కాన్సుల్ జనరల్
మిచిగాన్ పర్యటనలో భాగంగా భారత కాన్సుల్ జనరల్ (CG) ఆనంద్ ప్రకాశ్ ప్రవాస భారతీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు మరియు ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి అమెరికా కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదార్ ముఖ్య అతిథిగా హాజరై శోభను చేకూర్చారు.

ఉత్సాహభరితంగా సాగిన ఈ ముఖాముఖి కార్యక్రమంలో, వ్యాపారం, విద్య, మరియు నవకల్పనల (ఎంటర్ప్రెన్యూర్షిప్) రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలను కాన్సుల్ జనరల్ వివరించారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, సందేహాలను ఆయన సావధానంగా విని వాటి పరిష్కారానికి తగిన భరోసా ఇచ్చారు.
ప్రవాస భారతీయ సమాజ సంక్షేమానికి మరియు వారితో నిరంతర అనుసంధానానికి భారత కాన్సులేట్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆనంద్ ప్రకాశ్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.







