ఆటా బోర్డు ట్రస్టీల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) బోర్డు ఆఫ్ ట్రస్టీ స్థానాల భర్తీ కోసం నామినేషన్ల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించినట్లు నామినేటింగ్ కమిటీ ప్రకటించింది. సంస్థ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లడంలో , సమాజానికి సేవ చేయడంలో ట్రస్టీలు కీలక పాత్ర పోషిస్తారని తెలిపింది. ATA రాజ్యాంగంలోని ఆర్టికల్ III ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి సభ్యులు బోర్డు ట్రస్టీలను ఎన్నుకుంటారు.
ట్రస్టీ స్థానాలు , విభాగాల వివరాలు..
పదవీకాలం: 2027–2030 సంవత్సరాల కాలానికి గాను మొత్తం 16 ట్రస్టీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
గ్రాండ్ ప్యాట్రన్ సభ్యులు: ఈ విభాగం నుంచి 3 ట్రస్టీ స్థానాలు భర్తీ చేయనున్నారు.
ప్యాట్రన్ సభ్యులు: ఈ విభాగం నుంచి 3 ట్రస్టీ స్థానాలు కేటాయించారు.
లైఫ్ సభ్యులు: అత్యధికంగా ఈ విభాగం నుంచి 10 ట్రస్టీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
ఇవి కూడా చదవండి
షెడ్యూల్ వివరాలు..
అక్టోబర్ 15, 2026 (గురువారం) వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
అక్టోబర్ 22, 2026 (గురువారం)న అభ్యర్థుల అర్హతను పరిశీలించి సమాచారం అందిస్తారు.
అక్టోబర్ 27, 2026 (మంగళవారం) లేదా అంతకంటే ముందుగా నామినేషన్లను వెనక్కి తీసుకోవచ్చు.
అక్టోబర్ 31, 2026 (శనివారం) లేదా అంతకంటే ముందుగా నామినేటింగ్ కమిటీ తన నివేదికను బోర్డుకు అందజేస్తుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ..
పోస్టల్ అడ్రస్: చైర్పర్సన్, నామినేటింగ్ కమిటీ, అమెరికన్ తెలుగు అసోసియేషన్, పి.ఓ. బాక్స్ 2345, నేపర్‌విల్లే, IL 60567.
ఫలితాలు , తదుపరి ప్రక్రియ: నామినేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాత నవంబర్ మొదటి వారంలో ఈమెయిల్ ద్వారా ఫలితాల సమాచారం తెలియజేస్తారు. ఎన్నికలు అవసరమైతే ఎలక్షన్ కమిటీ త్వరలో బ్యాలెట్లను అందజేస్తుంది.
మరిన్ని వివరాలకు: సందేహాలు ఉన్నవారు [email protected] లేదా (919) 995-4337 నంబర్‌ను సంప్రదించవచ్చు. ఈ కమిటీలో మధు బొమ్మినేని (చైర్పర్సన్), కాశీ కొత్త, విజయ్ కుందూర్, భువనేశ్ బూజల, పర్మేష్ భీమ్‌రెడ్డి సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
Trustee Nomination Form: Download link








